తెలంగాణ

telangana

ETV Bharat / state

అయినా నేను పార్టీలోనే ఉన్నాను: వీహెచ్ - komatireddy

గెలిస్తే తమ గొప్పతనం అని... ఓడితే ఉత్తమ్, జానారెడ్డి ఓడించారని చెప్పుకుని పార్టీలు మారుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతురావు మండిపడ్డారు.

గాంధీభవన్​లో వీహెచ్

By

Published : Jun 17, 2019, 5:16 PM IST

హస్తం జెండాలు మోసిన వారు ఎంతోమంది ఉన్నా.. కోమటిరెడ్డి కుటుంబానికే కాంగ్రెస్ ఎన్నోపదవులు ఇచ్చిందని వీహెచ్ తెలిపారు. గెలిస్తే తన గొప్పతనమని... ఓడితే నాయకత్వ లోపని కోమటిరెడ్డి ఆరోపించడం సరికాదని తెలిపారు. అవకాశవాదులు మాత్రమే లాభం కోసం వేరే పార్టీకి పోతారంటూ మండిపడ్డారు. బెదిరించి పదవులు తీసుకోవడం... కాంట్రాక్టుల కోసం అధికార పార్టీలోకి వెళ్లడం సరికాదని వెల్లడించారు. కాంగ్రెస్ తనకు అన్యాయం చేసిందని తెలిపారు. ప్రచార కమిటీ ఛైర్మన్ పదవీ, ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఇస్తానని ఇవ్వలేదన్నారు. అయినా కూడా పార్టీని వీడలేదని.. పార్టీపై ఎలాంటి ఆరోపణలు చేయలేదని వీహెచ్ తెలిపారు.

గాంధీభవన్​లో వీహెచ్

ABOUT THE AUTHOR

...view details