మాంసాన్ని అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పశు సంవర్థక శాఖ అధికారుల కమిటీ హెచ్చరించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాంసం దుకాణం నిర్వాహకులు కనీసం దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు మాంసం దుకాణాల తనిఖీ కోసం ఆ శాఖకు చెందిన ఐదుగురు అధికారులతో కమిటీ ఏర్పాటైంది. కమిటీలో డాక్టర్ బాబు బెర్రి కన్వీనర్‌గా, డాక్టర్లు సింహారావు, ఖాద్రీ, భాస్కర్ రెడ్డిలు సభ్యులుగా ఉన్నారు.
పలు ప్రాంతాల్లో తనిఖీలు...