Venkaiah Naidu Comments on Politics: భారతదేశం వేగంగా ముందుకు సాగాలంటే రాజకీయాల్లో యువత పాలుపంచుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) అన్నారు. నీతి, నిజాయతీ, విలువలతో కూడిన రాజకీయాల్లోకి రావాలని చెప్పారు. హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(MCRHRD)లో జరిగిన సిటిజన్ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిటిజన్ యూత్ పార్లమంట్ కార్యక్రమం ఆలోచనలను పంచుకునేందుకు.. పెంచుకునేందుక చక్కటి అవకాశాన్ని కల్పిస్తోందని అన్నారు.
Venkaiah Naidu Speech at Citizen Youth Parliament Program :దేశంలోని పార్లమెంట్ వ్యవస్థలో ముందడుగు వేయలని చెప్పారు. భారతదేశం వేగంగా ముందుకు వెళ్లాలంటే యువత పాలుపంచుకోవాలని తెలిపారు. రాజకీయాల్లోకి యువత రావాలని.. నీతి,నిజాయతీ, విలువలతో కూడిన రాజకీయాలను ఏర్పరచాలని చెప్పారు. అలా ముందుకు వచ్చినప్పుడే ఆదర్శ, సిద్దాంత రాజకీయాలు వస్తాయని పేర్కొన్నారు. దేశ చరిత్ర, త్యాగాలు, పోరాటాలు, సవాళ్లు అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. సీనియర్ రాజకీయ నాయకుల చరిత్ర తెలుసుకోవాలని.. పాలిటిక్స్‌లోకి వచ్చేందుకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ అవసరం లేదని అన్నారు.
భ్రష్టుపడుతోన్న రాజకీయాలను యువతే బాగుచేయాలి : వెంకయ్య నాయుడు
Venkaiah Naidu Suggestions For Youth : రాజకీయాలంటే ఒక పార్టీ వదిలి.. ఇంకో పార్టీలోకి వెళ్లడం కాదని వివరించారు. ఆ పార్టీనే నమ్మి.. అంచెలంచెలుగా ఎదగాలని సూచించారు. దీనికి ఉదాహరణగా తన జీవిత అనుభవాల గురించి తెలిపారు. నమ్మిన సిద్ధాంతం వల్లే ఉపరాష్ట్రపతి స్థాయికి చేరుకున్నానని హర్షం వ్యక్తం చేశారు. యువత కష్టపడాలని.. క్రమశిక్షణతో వ్యవహరిస్తూ సమయపాలన పాటించాలని సూచించారు. ఏ విషయంలోనైనా చెయ్యాలనే తపన ఉండాలని ఉత్తేజపరిచారు. 'యోగ ఫర్ బాడీ నాట్ ఫర్ మోదీ(Yoga for Body not for Modi)' అని ప్రధానమంత్రి మోదీ చెప్పిన మాటలు గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ శరీర ఆరోగ్యం పెంచుకోవాలని అన్నారు.