ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 'అగ్రిటెక్ సౌత్-2020' సదస్సు ప్రారంభమైంది. మూడురోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో మంత్రులు మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.
దేశంలో వ్యవసాయ రంగంలో అనేక సవాళ్లు వేధిస్తున్నాయని వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని అయితే... అన్నదాతల కోసం ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని తెలిపారు. ఈ రంగాన్ని రక్షించుకునేందుకు శాస్త్రవేత్తలు, పరిశ్రమ వర్గాలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.