తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌, విజయవాడ జాతీయ రహదారిపై నిలిచిన రాకపోకలు - జాతీయ రహదారిపై నిలిచిన రాకపోకలు

హైదరాబాద్‌, విజయవాడ జాతీయ రహదారిపై పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఎల్బీనగర్‌, పనామా, సుష్మా, ఆటోనగర్‌, హయత్‌నగర్‌, పెద్దఅంబర్‌పేటలో భారీ వర్షం కారణంగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

vehicles trucked in hyderabad, vijayawada national highway
జాతీయ రహదారిపై నిలిచిన రాకపోకలు

By

Published : Oct 13, 2020, 9:07 PM IST

హైదరాబాద్​లో కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో హైదరాబాద్‌, విజయవాడ జాతీయ రహదారిపై పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఎల్బీనగర్‌, పనామా, సుష్మా, ఆటోనగర్‌, హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేటలో భారీ వర్షం కారణంగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

వర్షపు నీరు రహదారిపైకి చేరడం వల్ల వాహనాలు ముందుకు కదలడం లేదు. రెండు గంటలుగా వాహనాల్లోనే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానరహదారిపై నడుము లోతు నీటిలో వాహనదారులు ప్రయాణిస్తున్నారు. ఎల్బీనగర్‌ చింతలకుంట వద్ద డివైడర్‌ పైనుంచి వరద ప్రవహిస్తోంది.

జాతీయ రహదారిపై నిలిచిన రాకపోకలు

ఇదీ చదవండి:వర్షం నీటిలో తేలియాడుతున్న జంటనగరాలు

ABOUT THE AUTHOR

...view details