లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి బయట తిరుగుతున్న వాహనదారులపై హైదరాబాద్లో పోలీసులు కేసులు నమోదు చేశారు. బేగంబజార్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. పలు వాహనాలను సీజ్ చేశారు. చిన్న చిన్న కారణాలతో రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలు సీజ్ - నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు
లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నా... వాహనదారులు మాత్రం నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. పోలీసుల హెచ్చరికలను అస్సలు లెక్క చేయకుండా... చిన్న చిన్న కారణాలతో రోడ్లపైకి వస్తున్నారు.
![నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలు సీజ్ vehicles seized who violates lockdown rules](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:37:59:1621922879-11888587-seize.jpg)
నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలు సీజ్
హైదరాబాద్ లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. ఆంక్షలు పాటించని వారి వాహనాలు సీజ్ చేస్తున్నారు. వాహనదారుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చదవండి :ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వాయిదా