కొవిడ్-19 కారణంగా మోటారు వాహనాల క్వార్టర్ ట్యాక్స్ గ్రేస్ పీరియడ్‌ను లాక్డౌన్ పూర్తయిన తర్వాత ఒక నెల వరకు చెల్లించేలా పొడిగించినట్లు రవాణాశాఖ పేర్కొంది. ఈవిధంగా ట్యాక్స్‌ను ఆలస్యంగా చెల్లింనందుకు గాను ఎటువంటి అపరాధ రుసుమును వసూలు చేయమని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను రవాణాశాఖ విడుదల చేసింది. వాహనాలకు ప్రతి మూడు నెలలకు ఒకసారి క్వార్టర్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కరోనా నేపథ్యంలో వాహనదారులు వాటిని చెల్లించే వెసులుబాటు లేకపోవడం వల్ల... దాన్ని లాక్డౌన్ పూర్తయిన నెలలోపు క్వార్టర్ ట్యాక్స్‌ను చెల్లించే అవకాశం కల్పించినట్లు రవాణాశాఖ వెల్లడించింది.
వాహనాల పన్ను చెల్లింపు గడువు పెంపు - వాహనాల పన్ను గడువు పెంపు
వాహనాల పన్ను చెల్లింపు గడువు పెంచినట్లు రాష్ట్ర రవాణా శాఖ వెల్లడించింది. మోటారు వాహనాల క్వార్టర్ ట్యాక్స్ గ్రేస్ పీరియడ్‌ను నెల పాటు పొడిగించినట్లు తెలిపింది.
వాహనాల పన్ను చెల్లింపు గడువు పెంపు