దేశమంతా ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతోంది. అత్యవసర సేవల విభాగాల వాహనాలకే నగరంలో సంచరించేందుకు అనుమతులున్నాయి. మిగిలినవారెవరైనా నిత్యావసరాలకు ద్విచక్ర వాహనాలు, కార్లపై తమ నివాసం నుంచి 3 కి.మీ.లోపే ప్రయాణం చేయాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి. అయినా కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తూ స్వేచ్ఛగా రహదారులపై స్వైర విహారం చేస్తున్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఉన్నతాధికారులు వెల్లడించారు.
సీసీ కెమెరా దృశ్యాల పరిశీలన...
మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువదూరం తిరిగిన వాహనదారులను గుర్తించేందుకు ట్రాఫిక్ కూడళ్లు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను పోలీసులు ఉపయోగించుకుంటున్నారు. కమాండ్ కంట్రోల్ ద్వారా విశ్లేషించి నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదుచేస్తున్నారు.
ఓ కారుకు ఇ-చలానా...