సీతాఫల్మండి, చిలకలగూడ పోలీసుల ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ లేకుండా, ఒకే బండి పై ముగ్గురు ప్రయాణిస్తున్న వారిని, లైసెన్స్ లేని వారిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దాదాపు ముప్పై వాహనాలను తనిఖీ చేయగా.. ఐదు ద్విచక్ర వాహనదారులను పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనాలను పీఎస్‌కి తరలించారు. తనిఖీల్లో భాగంగా ఎస్ఐ రవి కుమార్, రాజు నాయక్ తదితరులు పాల్గొని వాహనదారులు సరైన పత్రాలు చూపించాలని, నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. మైనర్లు బండి నడిపితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
సీతాఫల్ మండిలో ఆకస్మిక వాహన తనిఖీలు - సీతాఫల్ మండి
సీతాఫల్ మండి, చిలకలగూడ ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మికంగా వాహన తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని, ముగ్గురు ఒకే వాహనంపై ప్రయాణించే వారి వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
సీతాఫల్ మండిలో ఆకస్మిక వాహన తనిఖీలు