హైదరాబాద్ పోలీసులు లాక్ డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నగరంలోని అసెంబ్లీ వద్ద నాంపల్లి ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఆపి చెక్ చేశారు. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత రహదారుపైకి వచ్చే వారిపై జరిమానా విధించడంతో పాటు వాహనాలు సీజ్ చేస్తున్నారు.
నగరంలో లాక్ డౌన్ మరింత పటిష్టం.. ఉల్లంఘిస్తే వాహనాల సీజ్ - అసెంబ్లీ వద్ద తనిఖీలు
రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతో నగరంలో పోలీసులు లాక్ డౌన్ మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు. అసెంబ్లీ వద్ద నాంపల్లి ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఉదయం 10 గంటలు తర్వాత రహదారులపైకి వస్తున్న వాహనదారులపై జరిమానా విధించడంతో పాటు వాహనాలు సీజ్ చేస్తున్నారు.
అసెంబ్లీ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు
అలాగే చాలా మంది ఆయా ప్రభుత్వ, వివిధ అత్యవసర సంస్థల నుంచి ఇచ్చిన స్టికర్లు వాహనాలపై అతికిస్తున్న వారి ఐడీ కార్డులు పరిశీలించారు. ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై జీహెచ్ఎంసీ స్టికర్ వేసుకొని రాగా.. ఐడీ కార్డు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. అత్యవసర పరిస్థితిల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలని సూచించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ మహమ్మారి కట్టడికి కృషి చేయాలని కోరారు.