Traffic speed in Hyderabad: హైదరాబాద్ రోడ్లపై వాహనాలు రయ్‌మంటూ 25 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్నాయి. కొన్ని మెట్రోనగరాలైన దిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పుణెలో ప్రైవేట్ రవాణా సంస్థలు నిర్వహించిన ‘స్పీడ్’ సర్వేలో ఆవిషయం తేలింది . హైదరాబాద్, నగరశివారుల్లో ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు... పోలీసులు, జాతీయ రహదారుల ఆథారిటీ- ఎన్హెచ్ఏఐ అధికారులు సమన్వయం చేసుకొని ముందుకెళ్తున్నారు. ఐతే కరోనాతో బస్సులు, రైళ్లల్లో ప్రయాణిస్తే వైరస్ సోకుతోందనే భావనతో చాలామంది కార్లు కొనుగోలు చేయడంతో రోడ్లపై రద్దీ కొంత పెరిగింది. ఈ ఏడాది సగటు వేగాన్ని మరింత పెంచాలనే లక్ష్యంతో అన్నిశాఖలను సమన్వయం చేసుకొని పనిచేస్తున్నట్లు ట్రాఫిక్ సంయుక్త కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.
Traffic speed in Hyderabad: రోడ్లపై దూసుకెళ్తున్న వాహనాలు.. మెట్రోనగరాల్లో హైదరాబాద్‌కి తొలి స్థానం - హైదరాబాద్ రోడ్లపై వాహనాల వేగం
Traffic speed in Hyderabad: కిక్కిరిసిన రోడ్లు.. గంటల కొద్దీ ట్రాఫిక్ జాంలు రణగొణధ్వనులతో నిత్యం పడుతూలేస్తూ ప్రయాణిస్తున్న మెట్రోనగరాల్లో హైదరాబాద్ భిన్నంగా నిలిచింది. రాజధాని రహదారులపై సగటు వేగం గంటకు 25 కిలోమీటర్లకు పెరిగనట్లు స్పీడ్‌సర్వేలో తేలింది. ఆయా నగరాల్లో రహదారుల విస్తీర్ణం, వాహనాల సాంద్రత, మౌలిక సదుపాయాల ఆధారంగా వాహనాల సగటు వేగాన్ని లెక్కగట్టాయి.
Traffic speed in Hyderabad: జంటనగరాల పరిధిలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం కింద పైవంతెనలు, కొన్ని కొత్త రహదారులు అందుబాటులోకి రావడం సైతం.....వాహనాల సగటం వేగం పెరగడానికి కారణమైంది. శివారు ప్రాంతాల్లో రహదారుల విస్తీర్ణం పూర్తవడం కలిసొచ్చింది. దుర్గంచెరువు పైవంతెన, ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ సహా మరికొన్ని రహదారులు ప్రజారవాణాకు అందుబాటులోకి వచ్చాయి. జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో రహదారుల విస్తరణతో ట్రాఫిక్ ఇబ్బందులు పరిష్కారమయ్యాయి. సంతోష్‌నగర్, షేక్‌పేట, పైవంతెనల ప్రారంభంతో పాతబస్తీ, టోలీచౌకీ, మెహిదీపట్నం ప్రాంతాల్లో వాహనాల రద్దీ గణనీయంగా తగ్గింది. హైదరాబాద్‌లో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో తొలి స్థానంలో నిలవగా..రెండు, మూడు స్థానాలను చెన్నై, బెంగళూరు దక్కించుకున్నాయి.
ఇదీ చూడండి: