కొవిడ్ సంక్షోభం దృష్ట్యా వాహన పన్ను రద్దు చేయడం పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పెద్ద మనుసుకు ఇదొక నిదర్శనమని మంత్రి కొనియాడారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహారిస్తోందని పేర్కొన్నారు.
లాక్‌డౌన్‌లో తీవ్రంగా నష్టపోయామని జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్‌పోర్టు వాహనాల నిర్వాహకుల విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రూ. 267 కోట్ల మేర మాఫీ చేయాలని నిర్ణయించడం హర్షించదగినదని మంత్రి పువ్వాడ తెలిపారు.