South Central Railway Employees President Muralikrishna: సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నిక హైదరాబాద్లో జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయి సంఘం డివిజనల్ అధ్యక్షుడు, సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా వేగి మురళీకృష్ణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా.. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘం హైదరాబాద్ బ్రాంచ్, రైల్వే కార్మిక మిత్రబృందం.. నాంపల్లి రైల్వే స్టేషన్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘం మెకానికల్ శాఖ కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు.
సౌత్ సెంట్రల్ రైల్వే ఉద్యోగుల అధ్యక్షుడిగా వేగి మురళీకృష్ణ
South Central Railway Employees President Muralikrishna: హైదరాబాద్లో జరిగిన సౌత్ సెంట్రల్ రైల్వే ఉద్యోగుల ఎన్నికల్లో డివిజినల్ అధ్యక్షుడిగా, సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా వేగి మురళీకృష్ణ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే కార్మిక బృందం విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది.
సౌత్ సెంట్రల్ రైల్వే ఉద్యోగుల అధ్యక్షుడిగా ఎంపికైన ..వేగి మురళీకృష్ణ
ముఖ్య అతిథిగా డివిజనల్ సెక్రటరి దాసరి భుజంగ రావు, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రెసిడెంట్ కావూరి మురళీకృష్ణ, కేంద్ర డివిజన్ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. కార్మికుల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తానని నూతనంగా ఎన్నికైన సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయి సంఘం డివిజనల్ అధ్యక్షుడు వేగి మురళీకృష్ణ తెలిపారు.
ఇవీ చదవండి: