రైతు బజార్లలో కూరగాయలు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ధరలు పెంచకుండా అమ్మాలని సూచించినా... ధరల నియంత్రణలో అధికారులు కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. లింగంపల్లిలోని రైతు బజార్లో భారీ మొత్తంలో కూరగాయల ధరలు పెంచేశారని... ఇలా అయితే సామాన్య ప్రజలు ఏమితిని బతకాలని ప్రశ్నిస్తున్నారు.
రైతు బజార్లలో చుక్కలను తాకుతున్న ధరలు - corona news in telangana
ఈ నెల 31 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ విధించడం వల్ల నిత్యావసర సరుకుల కోసం ప్రజలు బారులు తీరారు. లింగంపల్లిలోని రైతు బజార్‌కు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇదే అదునుగా భావించి రైతుబజారులో ధరలు పెంచేశారని ప్రజలు వాపోతున్నారు.
![రైతు బజార్లలో చుక్కలను తాకుతున్న ధరలు vegetables prices hiked in telangana due to lock down](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6513452-thumbnail-3x2-price-rk.jpg)
రైతు బజార్లలో చుక్కలను తాకుతున్న ధరలు
మొన్నటి వరకు కిలో రూ.15 ఉన్న టమోటా ధర ఇవాళ ఒక్కసారిగా రూ.100 దాటి పోయిందని.. ఏ కూరగాయలు చూసుకున్నా కిలో వందకు తక్కువ లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతు బజార్లలో చుక్కలను తాకుతున్న ధరలు
ఇవీ చూడండి: 27కు చేరిన కరోనా కేసులు.. కట్టడికి కఠిన నిర్ణయాలు