Masses Of God Veerasimha Reddy: మైత్రీ మూవీస్ సమర్పణలో.. నందమూరి నటసింహం బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా నటించిన వీరసింహారెడ్డి చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నెల 6న ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలు ఏబీఎన్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నట్లు శ్రేయాస్ మీడియా ప్రతినిధులు పేర్కొనగా.. పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఈవెంట్ నిర్వహణకు ప్రత్యామ్నాయ ప్రాంతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
'వీరనరసింహారెడ్డి' ప్రీరిలీజ్ ఈవెంట్‌పై ఉత్కంఠ.. అనుమతి నిరాకరణ - వీరసింహారెడ్డి ఈవెంట్‌కు అడ్డంకులు ఎదురయ్యాయి
Masses Of God Veerasimha Reddy: ఈ నెల 6న ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించనున్న 'వీరసింహారెడ్డి' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అడ్డంకులు ఎదురయ్యాయి. ఏబీఎన్ గ్రౌండ్స్‌లో నిర్వహించాలనుకున్న ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు.
మలినేని గోపిచంద్ దర్శకత్వంలో ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. బాలకృష్ణ, శృతి హాసన్‌తో పాటు చిత్రం యూనిట్ సభ్యులు పాల్గొంటారని.. రెండు గంటల పాటు జరిగే కార్యక్రమంలో 45 నిమిషాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, భారీ సెట్ ఏర్పాటు చేసి, నందమూరి అభిమానులకు కనులువిందుగా ఈవెంట్ నిర్వహిస్తామని శ్రేయాస్ మీడియా ప్రతినిధి శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి పిల్లలు, వృధ్ధులను తీసుకురావద్దని ఆయన కోరారు. తాజాగా పోలీసులు అనుమతి నిరాకరణతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై ఉత్కంఠ నెలకొంది.
ఇవీ చదవండి