అవిభక్త కవలలు వీణావాణిలు పదోతరగతి పరీక్షలు రాస్తున్నారు. హైదరాబాద్ మధురానగర్‌లోని ప్రతిభా హైస్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయానికి అరగంట ముందే చేరుకున్నారు. యూసఫ్‌గూడలోని స్టేట్ హోం నుంచి సూపరింటెండెంట్ సఫియా ప్రత్యేక అంబులెన్స్‌లో కవలలిద్దర్ని పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చారు.
పది పరీక్షలు రాస్తున్న అవిభక్త కవలలు వీణా-వాణి - VEENA VANI WRITTEN TENTH EXAMS IN MADHURANAGR
రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అవిభక్త కవలలు వీణావాణీలు కూడా పరీక్షలు రాస్తున్నారు. సాధారణ విద్యార్థుల కంటే వీణావాణీలకు అరగంట సమయం ఎక్కువ కేటాయించారు.
స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అక్కడికి చేరుకుని వీణావాణీలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆంగ్ల మాధ్యమంలో వీరిద్దరూ పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. సాధారణ విద్యార్థుల కంటే వీణావాణీలకు అరగంట సమయం ఎక్కువ కేటాయించారు. ఇద్దరు సహాయకులను కేటాయించినా స్వయంగా వీణావాణీలే పరీక్షలు రాస్తుండటం విశేషం. కరోనా పరిస్థితుల దృష్ట్యా వీణావాణిలు మాస్క్ లతో పరీక్ష కేంద్రానికి హాజరయ్యారు. అలాగే ఈ కేంద్రంలో పరీక్ష రాస్తున్న మిగతా విద్యార్థినీ విద్యార్థులు కూడా మాస్క్‌లు, వాటర్ బాటిళ్లు, సానిటైజర్లతో వచ్చారు.
ఇదీ చూడండి:పది పరీక్షలు ప్రారంభం.. విద్యార్థులంతా మాస్క్‌లతో హాజరు