తెలంగాణ

telangana

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసరాల అందజేత - తెలంగాణ వార్తలు

పారిశుద్ధ్య కార్మికులకు హైదరాబాద్​లోని వాసవి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున నిత్యావసరాలు అందజేశారు. కరోనా సమయంలో వారు చేస్తున్న కృషి ఎంతో గొప్పదని అసోసియేషన్ అధ్యక్షులు కొనియాడారు.

Vasavi nagara welfare distribute essentials in Hyderabad
Vasavi nagara welfare distribute essentials in Hyderabad

By

Published : Jun 10, 2021, 2:51 PM IST

కరోనా విపత్కర సమయంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు గొప్పవని వాసవి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తెలుకుంట సతీష్ గుప్తా అన్నారు. హైదరాబాద్​లోని కంటోన్మెంట్ ఐదో వార్డ్ పరిధిలోని 65 మంది పారిశుద్ధ్య కార్మికులకు 20 రకాల నిత్యవసర సరుకులు, కూరగాయలు అందజేశారు. అలాగే మన్సాన్​పల్లి అమర్​నాథ్ సాకారంతో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.

ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సామాజిక కార్యకర్త తేలుకుంట అరుణజ్యోతి చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర సరుకులను అందచేశారు. ఈ కార్యక్రమంలో దఫెదర్ రాజేష్, సిద్ధిరాములు రాజు, చిట్టిబాబు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: మిత్రులతో ఆ పని చేయాలని భార్యను వేధించి...

ABOUT THE AUTHOR

...view details