ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. జగన్మాత కనకదుర్గమ్మకు గత తొమ్మిది రోజులుగా.. వివిధ రకాల పుష్పాలతో అర్చన చేస్తున్నారు. చివరి రోజున కనకాంబరాలు, గులాబీలతో అమ్మవారికి అర్చన జరిపారు.
ఘనంగా ముగిసిన దుర్గమ్మ వసంత నవరాత్రి ఉత్సవాలు - దుర్గమ్మ గుడిలో వసంత నవరాత్రులు
ఏపీ ఇంద్రకీలాద్రిలో కొలువైన దుర్గమ్మకు తొమ్మిది రోజులుగా పుష్పార్చనలు జరిగాయి. వసంత నవరాత్రులు ముగియగా.. చివరి రోజున కనకాంబరాలు, గులాబీలతో అమ్మవారికి ఘనంగా అర్చన చేశారు.

Indrakiladri
ఘనంగా ముగిసిన దుర్గమ్మ వసంత నవరాత్రి ఉత్సవాలు
గోశాల ఎదుట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్దకు ఆయా పుష్పాలను తీసుకొచ్చి.. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య రుత్విక్కులు అమ్మవారికి పుష్పార్చన చేశారు. అనంతరం పంచహారతులు సమర్పించారు. ఉభయదాతలకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి.. శేషవస్త్రాలు, ప్రసాదాలు అందించారు.
ఇదీ చదవండి:వచ్చే నెల నుంచి 18ఏళ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్