కాంగ్రెస్ పార్టీపై దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఖండించారు. రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు దేశాన్ని, అఖిల భారత కాంగ్రెస్ను అవమానించేలా ఉన్నాయని సంపత్ కుమార్ రీట్వీట్ చేశారు. అనంతరం వర్మ మితిమీరిన పోకడపై సంపత్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఊరుకునేది లేదు..
ఎన్నో పోరాటాలు చేసి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీని ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు.