కొవిడ్ కేసులు పెరుగుతుండడం, పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలుతో ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రయాణీకులు లేక రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తోంది. తాజాగా 27 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జూన్ 1 నుంచి 16వ తేదీ వరకు ఈ రైళ్లను రద్దు చేస్తున్నామని రైల్వే శాఖ తెలిపింది. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని.. ఈవిషయాన్ని గమనించాలని రైల్వే శాఖ కోరింది.
రద్దయిన రైళ్ల వివరాలు:
1.గూడూరు-విజయవాడ 2.విజయవాడ-గూడూరు,
3.గుంటూరు-వికారాబాద్, 4. వికారాబాద్-గుంటూరు,
5. విజయవాడ-సికింద్రాబాద్, 6.సికింద్రాబాద్-విజయవాడ,
7.బీదర్-హైదరాబాద్, 8.సికింద్రాబాద్-బీదర్,
9.హైదరాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్, 10. సిర్పూర్ కాగజ్ నగర్ -హైదరాబాద్,
11.సికింద్రాబాద్-కర్నూల్ సిటీ, 12.కర్నూల్ సిటీ-సికింద్రాబాద్,