తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్ల సర్వీసులు రద్దు - ap news

కరోనా వ్యాప్తి నివారణ కోసం తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తోన్న కఠిన నిబంధనలు.. రైల్వేపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రయాణమంటేనే ప్రజలు జంకుతున్న పరిస్థితుల్లో.. కొన్ని రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.

తెలంగాణ వార్తలు
రైలు సేవలు రద్దు

By

Published : May 6, 2021, 11:18 PM IST

ఏపీ, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు వెళ్లే పలు రైళ్లను.. దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. శుక్రవారం నుంచి ఈ నెలాఖరు వరకు.. 28 ప్రత్యేక రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటి వివరాలను దక్షిణమధ్య రైల్వే వెబ్ సైట్​లో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంకండి: సుప్రీం కోర్టు

ఏపీ, తెలంగాణలో పాక్షిక కర్ఫ్యూ అమలు దృష్ట్యా.. రైలు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కొవిడ్​ ధాటికి భయపడి చాలా మంది అత్యవసరమైతేనే తప్ప బయటకు రావడం లేదు. ఫలితంగా.. తెలుగు రాష్ట్రాల్లో నడిచే పలు రైళ్లు ఖాళీగా రాకపోకలు చేయాల్సిన పరిస్ధితి నెలకొంది. రిజర్వేషన్ బోగీలన్నీ బోసిపోయాయి. సీట్ల భర్తీ నిష్పత్తి అతి తక్కువగా ఉన్న కారణంగా.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి:రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించబోము: సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details