సర్వ విఘ్న హరం దేవం... సర్వ కార్య ఫలప్రదం... సర్వసిద్ధి ప్రధాత.. వందేహం గణనాయకం... ఇలా చాలామంది శ్లోకాలతో బొజ్జ గణపయ్య ప్రార్థనలు చేస్తూ... విభిన్న రూపాల్లో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేస్తూ.. భక్తిశ్రద్ధలు చాటుకుంటున్నారు కొందరు. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి విజ్ఞనాథున్ని కొలుస్తున్న అనేక చారిత్రక మండపాలు నేటికీ అదే ఉత్సాహంతో కొనసాగుతున్నాయి.
జంటనగరాల్లో అపార్టుమెంట్ల సంస్కృతి పెరిగిపోవటం వల్ల మండపాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది మరింత పెరిగినట్లు ఉత్సవ సమితి అంచనా. పాతిక, ముప్పై ఏళ్లుగా వినాయక నవరాత్రులు నిర్వహిస్తున్న భక్త సమాజాల సంఖ్యకు హైదరాబాద్‌లో కొదువలేదు. వాడవాడాలా చాలాచోట్ల వీధికి మూడు నుంచి ఐదు వరకు విగ్రహాలను ఏర్పాటు చేశారు.
విభిన్న ఆకృతుల్లో గణనాథులు
బేగంబజార్, మహారాజ్ గంజ్, న్యూ ఉస్మాన్ గంజ్, గన్ ఫౌండ్రి తదితర ప్రాంతాలలో ఫైలావన్ గణపతి, మూషిక వాహన గణపతి, గజవాహన గణపతి, మయూరంపై గణపతి, హన్మాన్పై గణపతి, శివ పార్వతుల మద్య కూర్చున్న గణపతులు కొలువుదీరారు. తిరుమల బాలజీ, నర్సింహాస్వామి సెట్టింహగుతో కూడిన గణపతి, ఐదు నాగసర్పాలపై తాండవం చేస్తున్న శ్రీకృష్ణుడు, రాంమందిర్ సెట్టింగ్‌తో కూడిన గణపతి, శంకరుడు తాండవం చేస్తున్న ఇలా అనేక రూపాల్లో స్వామి ప్రతిమలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.