ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ప్రవేశ పరీక్ష "ఈఏపీ సెట్-2022" షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇంజినీరింగ్ అగ్రికల్చర్ సెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సురేశ్ తెలిపారు. జులై 4 నుంచి 8వ తేదీ వరకు ఇంజినీరింగ్ పరీక్ష, జులై 11, 12 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 11న నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఇతర పోటీ పరీక్షల తేదీలకు ఇబ్బంది లేకుండా షెడ్యూల్ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
జులై 4 నుంచి ఈఏపీ సెట్.. ఏప్రిల్ 11న నోటిఫికేషన్ - ఏపీ లేటెస్ట్ అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. జులై 4 నుంచి 8వ తేదీ వరకు ఇంజినీరింగ్ పరీక్ష, జులై 11, 12 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేశ్ వెల్లడించారు.
EXAM SCHEDULE
ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు ఉంటాయని మంత్రి వెల్లడించారు. ఈఏపీ సెట్ పరీక్షల ఫలితాలు ఆగస్టు 15 తర్వాత విడుదల చేసే యోచనలో ఉన్నామని చెప్పారు. సెప్టెంబరు రెండో వారంలో తరగతులు కూడా ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. పరీక్షా విధానం, ర్యాంకుల ప్రకటనలో మార్పుల్లేవని ప్రకటించారు. ఆగస్టు 15లోగానే ఇంటర్ ఫలితాలను కూడా వెల్లడిస్తాం అని సురేశ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:Disha Patrol Vehicles: దిశ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్