ప్ర. వరవరరావు ఆరోగ్య పరిస్థతిపై వస్తున్న వార్తలపై మీ స్పందన ఏమిటీ?
జ.టీవీ ఛానళ్లలో వస్తోన్న వార్తలను చూస్తున్నాం. వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది నిజం కాదు... కొంచెం ఆందోళనకరంగా ఉన్నది మాత్రం నిజం. ఇవాళ ఉదయం 11.30 గంటలకు ఆయన నుంచి ఫోన్ వచ్చింది. జైళ్లల్లో గత 3 నెలలుగా ములాఖత్‌లు లేని కారణంగా కలవడం కుదరలేదు. ఇంతకుముందు 3వారాలకోసారి ఫోన్ చేసేవారు. గత వారం నుంచి వారానికోసారి మార్చారు. జూన్ 24న మాట్లాడినప్పుడే ఆయన మాటల్లో బలహీనతను గమనించాం. శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ పడిపోవటమే దీనికి కారణం. మే 28నాడు అందుకే ఆయన్ను జేజే ఆసుపత్రిలో చేర్చారు.
ప్ర. 3వారాల క్రితం బెయిల్ కోసం విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. ఈ ప్రయత్నాలు ఎక్కడి వరకు వచ్చాయి?
జ.ఆయన అరెస్టై ఇప్పటికి 20 నెలల కాలమైంది. ఈ సమయంలో 5సార్లు బెయిల్ కోసం అభ్యర్థించాము. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో సుప్రీంకోర్టు... ఖైదీలను విడుదల చేయాలని మార్గదర్శకాలు ఇచ్చింది. నవీ ముంబయిలోని తలోజా జైలు సామర్థ్యం 2100 కాగా ఇప్పుడు అక్కడ 3600 మంది ఖైదీలు ఉన్నారు. ఆయనకు ఇదివరకే కొన్ని మానసిక రుగ్మతలు ఉన్నాయి. వయసు, ఆరోగ్యం, కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించాము. జూన్ 26న సెషన్స్ కోర్టు బెయిల్‌ను నిరాకరించింది. బుధవారం హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేశాం... శుక్రవారం దానిపై విచారణ జరగనుంది. ఇప్పుడు కుటుంబసభ్యలమంతా బెయిల్ కన్నా ముఖ్యంగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనకరంగా ఉన్నాం.
'వరవరరావు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది... విషమంగా కాదు' ఇదీ చూడండి :వరవరరావుకు తీవ్ర అస్వస్థతని ఎవరికీ చెప్పలేదు: హేమ