తెలంగాణ

telangana

ETV Bharat / state

Hyderabad Bengalore Vande Bharat Express Ticket Price : హైదరాబాద్​ టు బెంగళూరు వందేభారత్​ ఎక్స్​ప్రెస్.. రూట్​మ్యాప్​, టికెట్​ రేట్లు ఇవే - Kishan Reddy

Hyderabad Bengalore Vande Bharat Express Ticket Price : తెలుగు రాష్ట్రాల్లో రెండు వందేభారత్ రైళ్లు ఒకేసారి పరుగులు పెట్టనున్నాయి. తెలంగాణలో ఒకటి, ఆంధ్రప్రదేశ్​లో మరొక వందేభారత్ ఎక్స్​ప్రెస్​ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రెండు రైళ్లతో పాటు ప్రధాని మోదీ మరో ఏడు వందేభారత్ ఎక్స్​ప్రెస్​లను వివిధ ప్రాంతాల నుంచి ప్రారంభించనున్నారు. కాచిగూడ రైల్వేస్టేషన్‌లో జరిగే ప్రారంభ కార్యక్రమంలో.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​రెడ్డిలు పాల్గొననున్నారు.

Kacheguda- Yesvantpur Vandebharat Express
Vandebharat Express Starts Today

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2023, 10:37 AM IST

Hyderabad Bengalore Vande Bharat Express Ticket Price :తెలంగాణ రాష్ట్రంలో మూడో వందేభారత్ రైలు నేటి నుంచి పరుగులు పెట్టనుంది. ఇవాళ కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్​గా.. ఈ వందేభారత్ ఎక్స్​ప్రెస్​ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇప్పటికే తెలంగాణలో సికింద్రాబాద్-విశాఖపట్టణం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య రెండు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఇప్పుడు మూడో వందేభారత్ రైలు కాచిగూడ-యశ్వంత్​పూర్ మధ్య పరుగులు పెట్టనుంది.

Kacheguda Yesvantpur Vande Bharat Express : హైదరాబాద్​ టు బెంగళూరుకు​ వందేభారత్.. నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఈ స్వదేశీ సెమీ హైస్పీడ్ రైలు హైదరాబాద్ నగరంలోని కాచిగూడ రైల్వేస్టేషన్నుంచి ప్రారంభమై.. బెంగళూరు నగరంలోని యశ్వంతపూర్ రైల్వేస్టేషన్‌ వరకు వెళుతుంది. మహబూబ్‌నగర్, కర్నూలు టౌన్, అనంతపురం, ధర్మవరం రైల్వేస్టేషన్లలో వందేభారత్ ఆగుతుంది. కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య 610 కిలోమీటర్ల దూరాన్ని.. 8 గంటల 30 నిమిషాల వ్యవధిలో చేరుకుంటుంది.

Kacheguda- Yesvantpur Vandebharat Express :ప్రస్తుతం ఉన్న రైళ్ల కంటే ఇది దాదాపు 2 గంటల 50 నిమిషాలు.. తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకోనుంది. వందేభారత్ రెగ్యులర్​ సర్వీసులు ఈ నెల 25వ తేదీ నుంచి యశ్వంత్‌పూర్ నుంచి ప్రారంభం కానున్నాయి. 26వ తేదీ కాచిగూడ నుంచి ప్రారంభమవుతుంది. ఈ రైలు 8 కోచ్‌లతో నడుస్తుంది. 7 ఏసీ చైర్​కార్ కోచ్‌లు, ఒక ఎగ్జిక్యూటివ్ చైర్​కార్ కోచ్‌ ఉంటాయి. 530 సీట్ల సామర్థ్యం కలిగివున్న ఈ రైలు.. బుధవారం మినహా వారంలో మిగిలిన 6 రోజులు సర్వీసులో ఉంటుంది.

విజయవాడ- చెన్నై సెంట్రల్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. విజయవాడ, తమిళనాడులోని చెన్నై సెంట్రల్ మధ్య ప్రయాణిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా వందేభారత్ రైలు పరుగులు తీస్తుంది. కాచిగూడ-యశ్వంత్​పూర్ వందేభారత్ ఎక్స్​ప్రెస్ కాచిగూడ నుంచి ఉదయం 5.30కు ప్రారంభమై.. మధ్యాహ్నం 2.00లకు యశ్వంతపూర్​కు చేరుకుంటుంది. మళ్లీ తిరిగి మధ్యాహ్నం 2.45కు యశ్వంతపూర్ నుంచి ప్రారంభమై.. రాత్రి 11.15కు కాచిగూడకు చేరుకుంటుంది. ఐఆర్​సీటీసీ వెబ్‌సైట్​లో, రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ఛార్జీల పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అని రైల్వే శాఖ వెల్లడించింది. క్యాటరింగ్ ఛార్జీలు ప్రయాణికులు ఎంచుకునేవిధంగా టిక్కెట్‌లను బుక్ చేసేటప్పుడు ఎంచుకునే వెసులుబాటు కల్పించినట్లు అధికారులు తెలిపారు.

Kacheguda- Yesvantpur Vandebharat Ticket Prices :కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్ వరకు క్యాటరింగ్ ఛార్జీతో సహా ఏసీ చైర్​కార్ ఛార్జీ రూ.1,600లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ.2,915లుగా నిర్ణయించారు, యశ్వంత్‌పూర్ నుంచి కాచిగూడకు క్యాటరింగ్ ఛార్జీతో సహా ఏసీ చైర్​కార్ ఛార్జీ రూ.1,540లు, ఎగ్జిక్యూటివ్ తరగతి ధర రూ.2,865గా నిర్ణయించారు. కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్​కు క్యాటరింగ్ ఛార్జీలు మినహాయిస్తే ఏసీ చైర్​కార్ ఛార్జీ రూ.1,255లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ. 2,515లుగా నిర్ణయించారు. యశ్వంత్‌పూర్ నుంచి కాచిగూడకు క్యాటరింగ్ ఛార్జీలు మినహాయిస్తే ఏసీ చైర్​కార్ ఛార్జీ రూ.1,255లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ.2515గా నిర్ణయించారు.

Vande Bharat Sleeper Train : త్వరలోనే పట్టాలపైకి వందే భారత్​ స్లీపర్​ రైలు.. తక్కువ ధరలో వెళ్లేందుకు వందే మెట్రో రెడీ!.. ప్రారంభం అప్పుడే..

వందే భారత్ రైలు.. సౌకర్యాలు ఎలా ఉంటాయో చూద్దామా..!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details