ఒక్క అవకాశం ఇవ్వండి... పారదర్శకమైన పాలన అందిస్తానని ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని వనస్థలిపురం కాంగ్రెస్ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా పలు వ్యాపార సముదాయాలు, దుకాణాల వద్ద ఓటర్లను కలిసి తమకు ఓటు వేయాలని కోరారు. యువకుడైన తనకు ఒక్క అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తానని అన్నారు.
ఒక్క అవకాశం ఇవ్వండి: సామ రామ్మెహన్ రెడ్డి - వనస్థలిపురం కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం
వనస్థలిపురం డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి సామ రామ్మెహన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. యువకుడైన తనకు ఒక్క అవకాశం ఇస్తే... పారదర్శకమైన పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. గత పాలకుల పనితీరుపై పలు ఆరోపణలు చేశారు.
'ఒక్క అవకాశం ఇవ్వండి... పారదర్శకమైన పాలన'
వనస్థలిపురం కాంప్లెక్స్‌లో మంచిగా ఉన్న రోడ్డును తవ్వి... కొత్త రోడ్డును ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. ఆ పక్కనే ఉన్న కాలనీలో రెండేళ్లుగా పాడైన రోడ్డు ఉన్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేవలం కమిషన్ల కోసమే ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి:అనుభవం ఉంది... మరింత అభివృద్ధి చేస్తా: భాజపా అభ్యర్థి