సివిల్ తగాదాలో తలదూరిస్తే.. కఠినంగా వ్యవహరిస్తున్న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్.. మరొకరిపై వేటు వేశారు. ఓ భూవివాదంలో తలదూర్చినందుకు వనస్థలిపురం ఎస్‌ఐ విష్ణువర్ధన్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఠాణా ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, ఏసీపీ గాంధీ నారాయణకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మెమో జారీ చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో సివిల్ తగాదాల్లో తలదూరిస్తే... చర్యలు తప్పవని హెచ్చరించారు.
వనస్థలిపురం ఎస్ఐపై వేటు - mahesh bhagavat
హైదరాబాద్ వనస్థలిపురం ఎస్ఐపై వేటు పడింది. ఓ భూవివాదంలో తలదూర్చినందుకు సబ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నందుకు సీఐ, ఏసీపీలకు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మెమో జారీ చేశారు.
రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్