హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ హైదరాబాద్ పాతబస్తీలోని శ్రీ జగ్గశ్వర్ మహదేవ్, జగన్నాథ ఆలయ భూముల్లో చట్టవిరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని తెలంగాణ వానర సేన అధ్యక్షుడు రాంరెడ్డి తెలిపారు. శాలిబండ ప్రాంతంలో ఉన్న రెండు ఆలయాల భూములు కబ్జాకు గురవుతున్నాయని ఆరోపించారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని.. ఈ మేరకు తెలంగాణ వానర సేన ఆధ్వర్యంలో హైకోర్టులో పిల్ దాఖలు చేశామని... ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
'శాలిబండలోని ఆలయ భూముల్లో అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి' - ఉప్పుగూడలో వానరసేన అధ్యక్షుడు రాంరెడ్డి ప్రెస్మీట్
హైదరాబాద్ శాలిబండ ప్రాంతంలో ఉన్న శ్రీ జగ్గశ్వర్ మహదేవ్, జగన్నాథ ఆలయ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా... అందుకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వాటిపై అధికారులు చర్యలు తీసుకోవాలని వానర సేన అధ్యక్షుడు రాంరెడ్డి తెలిపారు.
'శాలిబండలోని ఆలయ భూముల్లో అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి'
హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేయకుండా కొందరు అధికార పార్టీ అండదండలతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని రాంరెడ్డి ఆరోపించారు. వీరిపై చర్యలు తీసుకోవాలని.. ఆలయ భూములను కాపాడాలని అధికారులను కోరారు. అధికారులు అడ్డుకోకపోతే.. వానరసేన అక్కడికి వెళ్లి భూమిని రక్షించుకుంటుందని హైదరాబాద్ ఉప్పుగూడ ప్రాంతంలో ఆయన తెలిపారు.
ఇదీ చదవండిః'బోగస్ పట్టాలని తేలితే కఠిన చర్యలు తప్పవు'