తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఆర్పీఎఫ్​ బెటాలియన్​ క్యాంప్​లో వాల్యుర్​ డే వేడుకలు

శామీర్​పేట్ మండలంలోని సీఆర్పీఎఫ్ రెండో బెటాలియన్ క్యాంపస్​లో 'వాల్యుర్ డే' సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఐజీపి సీఆర్పీఎఫ్ రంగారెడ్డి గ్రూప్ సెంటర్ బ్రజేష్ సింగ్ హజరయ్యారు.

hyderabad
valur day, crpf

By

Published : Apr 9, 2021, 5:29 PM IST

'వాల్యుర్​ డే' సందర్భంగా శామీర్​పేట్​లోని సీఆర్పీఎఫ్​ రెండో బెటాలియన్​ క్యాంపస్​లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఐజీపి సీఆర్పీఎఫ్ రంగారెడ్డి గ్రూప్ సెంటర్ బ్రజేష్ సింగ్ సైన్యం సేవలను కొనియాడారు.

1965లో గుజరాత్​లోని కచ్​ ప్రాంతంలో సర్దార్​పొస్టు వద్ద భారత సైనికుల స్థావరాలపై పాకిస్తాన్ బ్రిగేడ్లు దాడిని తిప్పికొట్టిన సైనికుల వీరత్వాన్ని కొనియాడారు. ఆనాటి జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. బెటాలియన్​లో కొవిడ్​ కేసులు పెరుగుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కమాండెంట్ సునీల్ కుమార్, సహయ కమాండెంట్​లు తులసి, రత్నమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.

సీఆర్పీఎఫ్​ బెటాలియన్​ క్యాంప్​లో వాల్యుర్​ డే వేడుకలు

ఇదీ చూడండి:ఏప్రిల్ నుంచే ప్రైవేటు టీచర్లకు సాయం

ABOUT THE AUTHOR

...view details