అఖిల భారత వాల్మీకి సమాజ్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో హిమాచల్‌ప్రదేశ్ రాజధాని షిమ్లాలో వాల్మీకి మహార్షి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. రామాయణ కావ్య సృష్టికర్త వాల్మీకి అని అన్నారు. దారి దోపిడీలకు పాల్పడుతూ.. మృగాలను వేటాడుతూ ఉండే ఓ బోయవాడు రామనామస్మరణతో వాల్మీకిగా మారాడని చెప్పారు.
బోయవాడు రామనామస్మరణతో వాల్మీకిగా మారాడు: దత్తాత్రేయ - షిమ్లా
దారి దోపిడీలకు పాల్పడుతూ.. మృగాలను వేటాడుతూ ఉండే ఓ బోయవాడు రామనామస్మరణతో వాల్మీకిగా మారాడని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. అఖిల భారత వాల్మీకి సమాజ్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో షిమ్లాలో నిర్వహించిన వాల్మీకి మహార్షి జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బోయవాడు రామనామస్మరణతో వాల్మీకిగా మారాడు: దత్తాత్రేయ
రామాయణం మహా గ్రంథం అని.. ఇదీ ఆదర్శం, నైతికత, సత్యం, ధర్మాన్ని ముందుంచిన శ్రీరాముని గాధ అని పేర్కొన్నారు. ఒకే మాట, ఒకే బాట, ఒకే బాణం గల శ్రీ రాముడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రామచంద్రుడి విలువలను పాటిస్తూ మన జీవితాన్ని పావనం చేసుకోవడమే వాల్మీకికి మనమిచ్చే నిజమైన నివాళని దత్తాత్రేయ కొనియాడారు.
ఇదీ చదవండి:తెరాస, భాజపా నోట్ల కట్టలతో వస్తున్నారు: జీవన్ రెడ్డి