తెలంగాణ

telangana

ETV Bharat / state

valley of words 2021: భాగ్యనగరంలో 'వ్యాలీ ఆఫ్ వర్డ్స్' కార్యక్రమం - తెలంగాణ వార్తలు

ప్రముఖ రచయితలు, అనువాదకర్తలు, విభిన్న భాషలు, సాహితీ ప్రియులతో శనివారం జూబ్లీహిల్స్ లోని ఎంసీఆర్ హెచ్​ఆర్​డీ కేంద్రం సందడిగా కనిపించింది. ఏటా డెహ్రాడూన్ వేదికగా జరుగుతోన్న 'వ్యాలీ ఆఫ్ వర్డ్స్ ' (valley of words 2021) సాహితీ పండగకు ఈసారి హైదరాబాద్ వేదికైంది.

Valley Of Words
Valley Of Words

By

Published : Nov 14, 2021, 5:42 AM IST

హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లోని ఎంసీఆర్​హెచ్​ఆర్​డీలో 'వ్యాలీ ఆఫ్​ వర్డ్స్'​ (valley of words 2021) సాహితీ కార్యక్రమం జరిగింది. రెండు రోజుల పాటు జరగనున్న కార్యక్రమాన్ని....ఇఫ్లూ వీసీ సురేశ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్ పై విశ్రాంత ఐఏఎస్ నరేంద్ర లూధర్ రాసిన 'ది ఫ్యామిలీ సాగా ' (The Family Saga) పుస్తకాన్ని ఎంసీఆర్ హెస్ఆర్​డీజీ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హర్ ప్రీత్ సింగ్, ఎల్​బీఎస్ఎన్ఎఏ మాజీ డైరెక్టర్ డా సంజీవ్ చోప్రాలతో కలిసి ఆవిష్కరించారు. ఏటా డెహ్రడూన్​లో జరిగే ఈ వేడుకలు ఈ సారి హైదరబాద్​లో జరగడం చాలా ఆనందంగా ఉందని మాజీ ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరులు అభివృధ్ది సంస్థలో (Marri Chennareddy Human Resource Development Institute) ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.

మంచి పుస్తకాలు నూతన ఉత్సాహన్ని ఇస్తాయని...మనుషులను, మనస్థత్వాలను కలిపే శక్తి పుస్తకానికే ఉందని మాజీ ఐఏఎస్ అధికారి సంజీవ్ చోప్రా అన్నారు. భారతీయ సంస్కృతి చాలా గొప్పదని.. సాహిత్యం అంతులేనిదని వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు రచయితలు, అనువాద కర్తలతో పాటు నల్గొండ అదనపు కలెక్టర్ ( రాహుల్ ), దక్షిణ మండల డీసీపీ గజరావు భూపాల్, సీహెచ్ఎస్ఎస్ ఫౌండర్ డా. రమేశా బాబు , దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా.అమ్మా మీర్జా తదితరులు పాల్గొన్నారు. నేడు బాలల దినోత్సవం సందర్భంగా బాల సాహిత్యం పుస్తకాలపై చర్చలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి .

ఇదీ చూడండి:grmb Chairman tour: రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలను పరిశీలించనున్న జీఆర్​ఎంబీ ఛైర్మన్​

ABOUT THE AUTHOR

...view details