తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు - తిరుమల శ్రీవారి వార్తలు

Vaikunta Ekadashi Celebrations : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక తిరుమల శ్రీవారి దర్శనం కోసం అర్ధరాత్రి నుంచే దర్శనాలను ప్రారంభించారు. పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు.

ఏకాదశి వేడుకలు
ఏకాదశి వేడుకలు

By

Published : Jan 2, 2023, 6:47 AM IST

Vaikunta Ekadashi Celebrations : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటికిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. తిరుమల, యాదాద్రి, అన్నవరం, భద్రాచలం, ద్వారక తిరుమల, మంగళగిరి, విజయవాడ, అనంతపురం, ధర్మపురి తదితర అన్ని ప్రముఖ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి అర్ధరాత్రి 12.05 గంటలకు దర్శనాలను ప్రారంభించారు.

ముందుగా అత్యంత ప్రముఖులు, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు శ్రీవాణి ద్వారా టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు. ఇక ఉదయం 6 గంటల నుంచి సామాన్య భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.

తిరుమలలో ఈ నెల 11 వరకు వైకుంఠద్వారం ద్వారా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేలా తితిదే ఏర్పాట్లు చేసింది. తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే, ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, రోజా, ఉషశ్రీ, మేరుగ నాగార్జున, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌, గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, మల్లారెడ్డి తదితర ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు.

ఇక భద్రాద్రి ఆలయానికీ భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం ద్వారా రామయ్యను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు వచ్చారు. దీంతో ఆలయం భక్త జన సంద్రంగా మారింది. సింహాచలంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక గజపతిరాజు తొలిదర్శనం చేసుకున్నారు. ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

ఇవీ చదవండి:

కొత్త సంవత్సరం వేళ భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు

'నుమాయిష్' ప్రారంభం.. కొలువుదీరిన 2 వేలకు పైగా స్టాళ్లు

ABOUT THE AUTHOR

...view details