కొవిడ్ వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించేలా.... పాతబస్తీ లాల్ దర్వాజా నాగుల్ చింత వద్ద ఫ్యూచర్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో.... టీకా గణపతిని ప్రతిష్టించారు. కొవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ డబ్బాలపై గణనాథుణ్ని నిలబెట్టారు. ఈ ఏర్పాట్లకు 15 రోజులు సమయం పట్టిందని నిర్వహకులు తెలిపారు.
vaccine ganesh: అవగాహన కల్పిస్తున్న వ్యాక్సిన్ గణపతి
వినాయకచవితి సందర్భంగా విభిన్న ఆకృతుల గణపతి విగ్రహాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ పాతబస్తీ నగూల్‌చింతలో... వ్యాక్సిన్ గణేశుడు కొలువుదీరాడు.
vaccine ganesh
అయిదు నుంచి పదివేల మందికి వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని నిర్వహకులు తెలిపారు. దర్శనానికొచ్చే భక్తులకు వ్యాక్సిన్ పట్ల అపోహలు తొలగించి... టీకా తీసుకునే విధంగా అవగాహన కల్పిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి:Ganesh Chaturthi: గణేషుని సేవలో తరించిన రాష్ట్ర రాజకీయ ప్రముఖులు