ప్రతివారంలో 4 రోజులు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రంలో 1,213 సెంటర్‌లు సిద్ధం చేశామన్నారు. పట్టణప్రాంతాల్లో ప్రైవేటు ఆస్పత్రులను వ్యాక్సినేషన్‌లో భాగస్వామ్యం చేస్తామని శ్రీనివాసరావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సిద్ధం చేశామన్నారు.
వ్యాక్సినేషన్ కార్యక్రమం సమన్వయం కోసం హైదరాబాద్‌లో నోడల్ అధికారిని నియమించామని పేర్కొన్నారు. నిమ్స్‌లో గవర్నర్, గాంధీ ఆస్పత్రిలో మంత్రి ఈటల రాజేందర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో తొలి వ్యాక్సిన్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తామని స్పష్టం చేశారు.