తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ ఉద్యోగులకు టీకా: మంత్రి పువ్వాడ - ministre puvvada ajay updates

హైదరాబాద్ మల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్టీసీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసేందుకు కార్యచరణ అమలు చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్​ సంబంధిత అధికారులను ఆదేశించారు.

covid vaccination
ఆర్టీసీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్

By

Published : Apr 10, 2021, 4:16 AM IST

ఆర్టీసీలో 45 సంవత్సరాలు దాటిన అందరికీ కరోనా వ్యాక్సిన్‌ వేసేందుకు కార్యాచరణను అమలు చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. నాలుగు రోజుల వ్యవధిలో 28 వేల మందికి ఈప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని రవాణా భవన్‌ నుంచి ఆర్టీసీ డిపో మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లతో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రతి డిపో నుంచి రోజుకు 70 నుంచి 80 మందికి వ్యాక్సిన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. మల్లాపూర్‌ పీహెచ్‌సీలో శుక్రవారం కుషాయిగూడ, చెంగిచర్ల డిపోలకు చెందిన డ్రైవర్లు, కండక్టర్లకు టీకా పంపిణీ కార్యక్రమాన్ని పువ్వాడ ప్రారంభించారు. ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ టీకా వేయించుకున్నారు.


నేటి నుంచి పీఆర్‌ ఉద్యోగులకు వ్యాక్సిన్‌
రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌ ఉద్యోగులకు మూడు రోజుల్లో కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు ఆదేశించారు. ఈ నెల 10(శనివారం) నుంచి 14వ తేదీ వరకు అదనపు కలెక్టర్‌ నుంచి పంచాయతీ కార్యదర్శి వరకు అందరూ విధులకు హాజరుకావాలని సూచించారు. జిల్లా స్థాయిలో పరిషత్‌ సీఈవోలకు నోడల్‌ అధికారులుగా బాధ్యత అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.


అటవీశాఖ సిబ్బంది కూడా తీసుకోవాలి: ఇంద్రకరణ్‌రెడ్డి


అటవీశాఖలో కొద్దిరోజులుగా ఉన్నతాధికారులు, ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నందున సిబ్బంది అందరూ టీకాలు తీసుకోవాలని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. ముఖ్యంగా అడవుల్లో విధులు నిర్వర్తించేవారు వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నారు. అటవీ సిబ్బందిని ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించి వారికీ ప్రాధాన్యంగా వ్యాక్సిన్‌ అందించాలని వైద్యశాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్లు అటవీశాఖవర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి:మాస్క్ లేకుంటే విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు: డీజీపీ

ABOUT THE AUTHOR

...view details