తెలంగాణ

telangana

ETV Bharat / state

Vaccination: చార్మినార్ జోన్​లో 1,900 మందికి వ్యాక్సినేషన్ - Telangana news

హైదరాబాద్ చార్మినార్ జోన్​లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 1,900 మందికి అధికారులు టీకా వేశారు. వ్యాక్సిన్ కోసం ప్రజలు ఉదయం నుంచే కేంద్రానికి తరలివచ్చారు.

vaccine
vaccine

By

Published : May 28, 2021, 3:02 PM IST


హైదరాబాద్ చార్మినార్ జోన్​లో ఇప్పటివరకు దాదాపు 1,900 మందికి అధికారులు వాక్సినేషన్ (Vaccination) పూర్తి చేశారు. చార్మినార్ జోన్​లో సూపర్ స్ప్రెడర్ల కోసం 7 వాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
చాంద్రాయణగుట్ట సుహాన ఫంక్షన్ హాల్​లో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ కేంద్రానికి సూపర్ స్ప్రెడర్లు భారీ సంఖ్యలో చేరుకొని లైన్​లో వేచి ఉండి వ్యాక్సిన్ వేసుకుంటున్నారు.

బార్కాస్ ప్రభుత్వ ఆసుపత్రి ఎస్పీహెచ్ఓ అమృత లక్ష్మి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రిచా గుప్తా, ఏసీపీ ఫలక్ నుమ ఎంఏ మాజిద్ వాక్సినేషన్ సెంటర్ లో ఉండి పరిస్థితిని సమీక్షించారు.

వాక్సినేషన్ (Vaccination) సెంటర్ లో వృద్ధులు, వికలాంగులు కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఆక్సిజన్ బెడ్స్ సైతం ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్​పై అపోహలు వీడి ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియొగం చేసుకోవాలని డాక్టర్ అమృత లక్ష్మి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details