తెలంగాణ

telangana

ETV Bharat / state

Vaccination: రాష్ట్రంలో వేగవంతంగా సాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ - covid teeka in telangana state

రాష్ట్రంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని.. ఇప్పటివరకు 67 లక్షల 95 వేలకు పైగా టీకాలు ఇచ్చినట్లు సర్కారు వెల్లడించింది. అందులో 0.17 శాతం టీకాలు మాత్రమే వృథా అయినట్లు తెలిపింది.

vaccination in telangana state
రాష్ట్రంలో 67 లక్షలకుపైగా టీకాలు వినియోగం

By

Published : Jun 11, 2021, 12:13 PM IST

రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. తాజాగా 1,67,785 మందికి తొలి డోస్, 13,157 మందికి రెండో డోస్ వ్యాక్సినేషన్ ఇచ్చినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,80,942 మందికి కొవిడ్ టీకాలు అందించారు. ఇప్పటివరకు మొత్తం 59,16,529 మందికి మొదటి డోస్ టీకా, 14,82,712 మందికి రెండో డోస్​ టీకాలు పూర్తైనట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్నవారిలో 12,36,973 మందికి, 45 ఏళ్లు పైబడిన వారు 53,61,220, హెల్త్ కేర్ వర్కర్లు 4,40,212, ఫ్రంట్ లైన్ వర్కర్లు 3,60,836 మంది టీకాలు తీసుకున్నారు. తెలంగాణకు ఇప్పటివరకు 68 లక్షల 69 వేల 550 డోసుల టీకాలు అందగా... అందులో ఇప్పటికే 67 లక్షల 95 వేల 53 డోసులు వినియోగించినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరో 0.17 శాతం టీకాలు వృథా అయినట్టు స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి

ABOUT THE AUTHOR

...view details