రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బందితో పాటు 18 ఏళ్లు పైబడిన విద్యార్థులందరికీ వందశాతం టీకాలు లక్ష్యంగా పెట్టుకొంది. ఇందుకోసం సెప్టెంబరు పదో తేదీని గడువుగా నిర్దేశించింది. ప్రతి విద్యాసంస్థలో బోధన, బోధనేతర సిబ్బంది, 18ఏళ్లు పైబడిన విద్యార్థులందరికీ టీకాలు పూర్తయితే వందశాతం వ్యాక్సినేటెడ్‌గా ప్రకటించాల్సి ఉంటుంది. ఆమేరకు వ్యాక్సినేషన్ పూర్తయినట్టు విద్యాసంస్థల్లో ప్రత్యేకంగా బ్యానర్ ఏర్పాటు చేయడంతో పాటు చిన్న పాటి కార్యక్రమం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తెలిపింది.
CORONA VACCINE: విద్యాసంస్థల్లో వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్ దిశగా చర్యలు - telangana varthalu
రాష్ట్రంలో దాదాపు ఏడాదిన్నర తర్వాత విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి. అన్ని విద్యాసంస్థల్లో వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బందితో పాటు 18 ఏళ్లు పైబడిన విద్యార్థులందరికీ వందశాతం టీకాలు లక్ష్యంగా పెట్టుకొంది.
వందశాతం టీకాల లక్ష్య సాధనకోసం ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు స్థానిక పీహెచ్‌సీతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించింది. అన్ని విద్యాసంస్థల్లో సెప్టెంబరు పదో తేదీ కల్లా వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు తెలిపింది. టీకాల ప్రక్రియను విద్యాసంస్థల ముఖ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, వ్యాక్సినేషన్ పురోగతిపై జిల్లా అధిపతులకు ప్రతిరోజూ నివేదిక పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: Bullettu bandi: బుల్లెట్టు బండి క్రేజ్... డుగ్గు డుగ్గు బండి స్కూల్ వెర్షన్ 2.O