తెలంగాణ

telangana

ETV Bharat / state

Vaccination: ఈ నెల 28, 29న జర్నలిస్టులకు వ్యాక్సినేషన్‌ - Vaccination for journalists on this month 28 and 29

ఈ నెల 28, 29 తేదీల్లో స్పెషల్ డ్రైవ్ ద్వారా పాత్రికేయులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు రాష్ట్ర సమాచార ప్రసారాల శాఖ ప్రకటించింది. జిల్లాల్లో డీపీఆర్వో సూచించిన కేంద్రాల్లో, రాష్ట్ర స్థాయి జర్నలిస్టులకు హైదరాబాద్‌లో గుర్తించిన 5 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.

జర్నలిస్టులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం
జర్నలిస్టులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం

By

Published : May 26, 2021, 11:01 PM IST

జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్, సూపర్ స్ప్రెడర్స్ జాబితాలోకి చేర్చిన ప్రభుత్వం.. వారి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ నెల 28, 29 తేదీల్లో స్పెషల్ డ్రైవ్ ద్వారా పాత్రికేయులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు రాష్ట్ర సమాచార ప్రసారాల శాఖ ప్రకటించింది. జిల్లాల్లో డీపీఆర్వో సూచించిన కేంద్రాల్లో, రాష్ట్ర స్థాయి జర్నలిస్టులకు హైదరాబాద్‌లో గుర్తించిన 5 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

హైదరాబాద్‌లో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్, బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, చార్మినార్‌లోని యునాని ఆసుపత్రి, వనస్థలిపురంలోని ఏరియా ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మీడియా మిత్రులు వారి ఆధార్ కార్డు, అక్రిడేషన్ కార్డులతో సూచించిన వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సమాచార ప్రసారాల శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ కోరారు.

ఇదీ చూడండి:లిఖిత పూర్వక హామీ వస్తేనే విధుల్లో చేరతాం: జూడాలు

ABOUT THE AUTHOR

...view details