'ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్లకు రవాణాశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా టీకాలు'
రేపటి నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రవాణాశాఖ ఆధ్వర్యంలో ఉచిత వ్యాక్సిన్‌ను అందజేయనున్నారు. గ్రేటర్ పరిధిలో మూడు లక్షల పైచిలుకు ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. వీరందరికి వ్యాక్సిన్ వేసేందుకు 10 కేంద్రాలను ఏర్పాటు చేశామని రవాణాశాఖ అధికారులు తెలిపారు.వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చే వారు తమ వెంట డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఆర్సీ జిరాక్స్ తీసుకుని రావాలని రవాణా శాఖ స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని రవాణాశాఖ విజిలెన్స్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పాపారావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్లకు రవాణాశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా టీకాలు'