రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. గ్రేటర్ హైదరాబాద్‌లో రవాణా శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు టీకాలు వేస్తున్నారు. హైదరాబాద్ రాజ్‌భవన్ వద్ద ప్రభుత్వ పాఠశాలలో టీకా కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆటో, క్యాబ్ డ్రైవర్లకు వ్యాక్సినేషన్ - telangana latest news
వ్యాక్సిన్ తీసుకోవాలనుకున్న డ్రైవర్లు ముందుగా రవాణా శాఖ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సీఎస్ సోమేశ్‌కుమార్ సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకా కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. రాజ్‌భవన్ వద్ద ప్రభుత్వ పాఠశాలలో వ్యాక్సినేషన్‌ను ఆయన ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆటో, క్యాబ్ డ్రైవర్లకు వ్యాక్సినేషన్
జీహెచ్ఎంసీ పరిధిలో 10 కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోవాలనుకున్న డ్రైవర్లు ముందుగా రవాణా శాఖ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకా కార్యక్రమం కొనసాగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఆర్సీ జిరాక్స్ కాపీ తీసుకురావాలని అధికారులు కోరారు.
ఇదీ చూడండి: Heavy rains: ఆగమనానికి ముందే ముంచెత్తిన వాన.. తడిసి ముద్దయిన ధాన్యం