అనునిత్యం ప్రజలతో కలిసి పని చేస్తున్న తమ ఉద్యోగులను కరోనా బారి నుంచి కాపాడుకునేందుకు... వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు హైదరాబాద్ జోన్ యూనియన్ బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ కబీర్ భట్టాచార్య తెలిపారు. హైదరాబాద్ కోఠిలోని యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయంలో అపోలో ఆస్పత్రి వైద్య బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
Vaccine center: బ్యాంకు ఉద్యోగుల కోసం కోఠిలో వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు - హైదరాబాద్ జోన్ యూనియన్ బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ కబీర్ భట్టాచార్య తాజా వార్తలు
హైదరాబాద్ కోఠిలోని యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయంలో బ్యాంకు ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని హైదరాబాద్ జోన్ యూనియన్ బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ కబీర్ భట్టాచార్య ప్రారంభించారు.
బ్యాంకు ఉద్యోగుల కోసం కోఠిలో వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు హై
ఈ కేంద్రంలో తమ ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులూ టీకా తీసుకునే అవకాశం కల్పించినట్లు భట్టాచార్య తెలిపారు. తొలి విడతగా మొదటి రోజు 200 మందికి టీకా అందించినట్లు పేర్కొన్నారు. అర్హులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని మేనేజర్ భట్టాచార్య సూచించారు.
ఇదీ చదవండి :ఆనందయ్య మందు.. కోటయ్య మృతి