తెలంగాణ

telangana

ETV Bharat / state

Vaccination: ఈనెల 6వ తేదీన న్యాయవాదులకు వ్యాక్సిన్​

ఈనెల 6వ తేదీన అపోలో ఆస్పత్రిలో న్యాయవాదులకు వ్యాక్సిన్లు(vaccination) ఇవ్వనున్నారు. హైకోర్టు(High Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ చొరవతో న్యాయవాదులందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. రేపు సాయంత్రం 4లోగా కొవాగ్జిన్​కు 1250, కొవిషీల్డ్ కోసం 850 రూపాయలు చెల్లించి వివరాలు నమోదు చేయాలని బార్ కౌన్సిల్ కార్యదర్శి రేణుక తెలిపారు.

vaccination
vaccination: ఈనెల 6వ తేదీన న్యాయవాదులకు వ్యాక్సిన్​..

By

Published : Jun 3, 2021, 7:16 PM IST

న్యాయవాదులకు కొవిడ్ వ్యాక్సిన్(vaccination) కోసం బార్ కౌన్సిల్ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసింది. ఈనెల 6వ తేదీన అపోలో ఆస్పత్రిలో న్యాయవాదులకు వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. ఆ రోజున హైకోర్టు సిబ్బందికి కూడా అపోలోలో వ్యాక్సిన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

హైకోర్టు(High Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ చొరవతో న్యాయవాదులందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. రేపు సాయంత్రం 4లోగా కొవాగ్జిన్​కు 1250, కొవిషీల్డ్ కోసం 850 రూపాయలు చెల్లించి వివరాలు నమోదు చేయాలని బార్ కౌన్సిల్ కార్యదర్శి రేణుక తెలిపారు. న్యాయవాదులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు చొరవ తీసుకున్నందుకు హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహీలికి అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి:Baby Murder: మూడేళ్ల బిడ్డను చంపి అంత్యక్రియలు..

ABOUT THE AUTHOR

...view details