ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కంకిపాడు వాణీనగర్‌లోని నియోజకవర్గ వైకాపా కార్యాలయంలో టీకా శిబిరం నిర్వహించడం వివాదాస్పదమైంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం నుంచే కంకిపాడు, పునాదిపాడు, నెప్పల్లి, తెన్నేరు, ఉప్పలూరు, ఈడుపుగల్లు, గొడవర్రు, కుందేరు, ప్రొద్దుటూరు గ్రామాలకు చెందిన అధికార పార్టీ నేతలు, వారి కుటుంబ సభ్యులు వాహనాల్లో కార్యాలయానికి తరలివచ్చారు.
వైకాపా కార్యాలయంలో టీకా శిబిరం! - కంకిపాడు తాజా వార్తలు
ఏపీ కృష్ణా జిల్లా కంకిపాడు వాణీనగర్‌లోని నియోజకవర్గ వైకాపా కార్యాలయంలో టీకా శిబిరం నిర్వహించడం వివాదాస్పదమైంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి.
ycp office
టీకా విషయాన్ని గోప్యంగా ఉంచడంతో వీరు ఎందుకు వస్తున్నారో ఇతరులకు తెలియలేదు. పార్టీలో అధిక పలుకుబడి కలిగిన వారికే ముందుగా టీకాలు వేసి పంపారు. చిన్న నాయకులు, కార్యకర్తలకు చివరి క్షణంలో వ్యాక్సిన్ వేశారని చెబుతున్నారు. దీనిపై సంబంధిత రెవెన్యూ, వైద్యాధికారులను వివరణ కోరగా ‘అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. మా శాఖల అధికారులు, సిబ్బందికి సంబంధం లేదు’ అని చెప్పారు.
ఇదీచూడండి:కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ముగ్గురు మృతి