forest officers notification in TS : రాష్ట్ర ప్రభుత్వం అడవుల రక్షణ, పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రత్యామ్నాయ అడవుల పెంపకం, రికార్డు స్థాయిలో కొత్త ఫారెస్ట్ బ్లాక్‌ల నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అటవీశాఖ పనితీరు, పురోగతిపై సచివాలయంలో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణకు హరితహారం ద్వారా ప్రభుత్వం పర్యావరణ రక్షణకు, అడవుల పునరుద్ధరణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. శాఖా పరంగా అన్ని రంగాల్లో జాతీయ స్థాయి గుర్తింపు రావటం సంతోషకరమని మంత్రి అన్నారు. బీడీ కార్మికులకు సేకరణ ఛార్జీలు, బోనస్ అన్లైన్ ద్వారా నేరుగా ఖాతాలకు చెల్లింపు ప్రక్రియను అధికారులతో కలిసి మంత్రి ప్రారంభించారు.
Forest Deportment Jobs Notification in TS : సుమారు లక్ష మంది లబ్దిదారులకు రూ.220 కోట్లు బోనస్‌ను చెల్లించటం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. వివిధ ప్రభుత్వ అభివృద్ధి పనులకు అటవీ భూములను వినియోగించుకున్నప్పుడు.. ప్రత్యామ్నాయ భూముల్లో కంపా నిధుల ద్వారా అడవులను అభివృద్ధి చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని అన్నారు. ఈ రకంగా 135 కొత్త అటవీ బ్లాక్‌లను అభివృద్ధి చేస్తూ, సుమారు 14 వేల ఎకరాల అడవిని సృష్టించటంతో పాటు, ఆ అటవీ బ్లాక్‌లను ప్రభుత్వం ద్వారా నోటిఫై చేయటం ఒక రికార్డని మంత్రి అన్నారు.