ప్రధాన మంత్రి నరేద్రమోదీ తానొక్కడే భారతీయుడ్ని అనేలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఎద్దేవా చేశారు. దేశభక్తి ఉన్న ప్రధాని.. జాతీయ పతాక వారోత్సవాలు ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు. దేశభక్తి అంటే భాజపా అనేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
దక్షిణాది నేతలపై చిన్నచూపు
జాతీయ పతాకం రూపొందించి వందేళ్లు దాటినా శతాధిక ఉత్సవాలు ఎందుకు జరపడం లేదని మోదీని వీహెచ్ ప్రశ్నించారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య దక్షిణాది నేత కావడంతోనే నిరాదరణకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం మీద ఆయనకు నిజమైన ప్రేమ ఉన్నట్లయితే ఉత్సవాలు జరిపించాలని డిమాండ్ చేశారు.
శతాధిక ఉత్సవాలను జరిపించేలా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ప్రధానిని విజ్ఞప్తి చేయాలని వీహెచ్ కోరారు. వార్షికోత్సవాలు జరపకపోతే మోదీ చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:కిడ్నాప్ కేసు నిందితులను పట్టుకున్నాం: సీపీ