తెలంగాణ

telangana

ETV Bharat / state

v hanumantha rao: 'రేవంత్​పై నేరుగా విమర్శలు చేయలేదు' - రేవంత్​ రెడ్డిపై వీహెచ్​ వ్యాఖ్యలు

ఎంపీ రేవంత్‌ రెడ్డిపై(Revanth reddy) ఇటీవల తానెప్పుడూ నేరుగా విమర్శలు చేయలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతురావు(v hanumantha rao) తెలిపారు. మొదట్లో విమర్శలు చేశానన్న ఆయన... పీసీసీ అధ్యక్ష పదవి బీసీకి ఇవ్వాలని కోరారు.

v hanumantha rao
v hanumantha rao: 'రేవంత్​పై నేరుగా విమర్శలు చేయలేదు'

By

Published : Jun 3, 2021, 6:14 PM IST

మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి(Revanth reddy) పై ఇటీవల తానెప్పుడూ నేరుగా విమర్శలు చేయలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతురావు(v hanumantha rao) స్పష్టం చేశారు. తాను మొదట్లో రేవంత్‌పై విమర్శలు చేశానని… ఆ తరువాత ఏనాడు కూడా చేయలేదన్న ఆయన… పీసీసీ అధ్యక్ష పదవి బీసీకి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

రెండు రోజుల క్రితం ఓ ఛానల్‌ చర్చలో పాల్గొన్న సమయంలో ఓ నాయకుడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి(Revanth reddy) వస్తే ఇబ్బంది ఏమిటి అని అడిగిన ప్రశ్నకు మాత్రమే… తాను సమాధానం ఇచ్చానని… అది కూడా రేవంత్‌పై పోలీసు కేసులు ఉన్న విషయాన్ని ప్రస్తావించానని వీహెచ్​ తెలిపారు.

గతంలో వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి, పి.జనార్ధన్‌ రెడ్డిలతో విభేదాలు ఉన్నప్పటికీ… ఎప్పడూ వారి అనుచరులు, అభిమానులు కానీ ఫోన్‌లు చేసి దుర్భాషలాడలేదని పేర్కొన్నారు. ఇతర పార్టీల వారు, సొంత పార్టీకి చెందిన వారు కూడా తిడుతున్నారని ఆరోపించారు. ఫోన్‌ చేసిన వ్యక్తి రేవంత్‌ రెడ్డి(Revanth reddy) పేరు చెప్పి తిట్టాడని విమర్శించారు. తనను గాంధీ భవన్‌లో మీడియా సమావేశాలు పెట్టకుండా పీసీసీ అధ్యక్షుడు అడ్డుకుంటున్నారని విమర్శించారు.

ఇదీ చూడండి:కొవిడ్​ వ్యాక్సిన్​ రెండో డోస్​ తీసుకున్న ఎంపీ రేవంత్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details