కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ... గ్రామాల్లో తిరుగుతూ... రైతులను చైతన్యవంతులను చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు. రైతులకు తీవ్ర నష్టం కలిగించే ఈ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ... హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఆయాకర్ భవన్ ముందు కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్‌తో కలిసి ఆందోళనకు దిగారు.
వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలి: వీహెచ్ - హైదరాబాద్ వార్తలు
రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఆయాకర్ భవన్ ముందు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌తో కలిసి ఆందోళనకు దిగారు.
వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలి: వీహెచ్
ఈ బిల్లులు దేశంలోని అన్నదాతలకు మరణ శాసనమేనని అన్నారు. ప్రధాని మోదీ కార్పొరేట్ కంపెనీలకు మేలు చేస్తూ... రైతులను పెట్టుబడి దారులకు బానిసలుగా మారుస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ప్రభుత్వం ఈ బిల్లులను ఉపసంహరించుకునేంతవరకు పోరాటం చేస్తామన్నారు.
ఇదీ చదవండి:ఆరు నెలల తర్వాత హైదరాబాద్‌లో ఆర్టీసీ సేవలు