తెలంగాణ

telangana

ETV Bharat / state

రేవంత్​ను వ్యతిరేకిస్తే అంతు చూస్తామంటున్నారు:వీహెచ్​ - తెలంగాణ తాజా వార్తలు

పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో అడ్డుతగులుతున్నానంటూ... తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని కాంగ్రెస్‌ నేత వీహెచ్​ ఆరోపించారు. ఈ మేరకు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన... తనకు ప్రాణహాని ఉందని తెలిపారు.

రేవంత్​ను వ్యతిరేకిస్తే అంతు చూస్తామంటున్నారు:వీహెచ్​
రేవంత్​ను వ్యతిరేకిస్తే అంతు చూస్తామంటున్నారు:వీహెచ్​

By

Published : Dec 26, 2020, 5:10 AM IST

రేవంత్​రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నావు. నీ అంతు చూస్తా అంటూ వాద్రా కమాల్​ అనే వ్యక్తి ఫోన్​ చేసి బెదిరించాడని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉందని... పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు.

వీహెచ్​ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఐపీసీ సెక్షన్​ 506 కింద కేసు నమోదు చేశామని రాయదుర్గం ఎస్సై సైదులు తెలిపారు.

ఇదీ చూడండి:'సెటిల్ చేసుకున్నా క్రిమినల్ కేసు రద్దు కాదు'

ABOUT THE AUTHOR

...view details