డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు బలిదానం చేసుకోవద్దని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. కార్మికుల తరఫున తామంతా పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వ తీరుపై మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆర్టీసీ డ్రైవర్ డి.శ్రీనివాస్ రెడ్డిని ఆయన పరామర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి అణచివేత ధోరణికి ఎప్పుడూ పాల్పడలేదని... ఒకప్పుడు కార్శిక శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి కార్మిక యూనియన్లను పెట్టొద్దంటున్నారని ఆక్షేపించారు.
ఇప్పటి వరకు ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: వీహెచ్
ఆర్టీసీ కార్మికులెవరూ ప్రాణత్యాగం చేసుకోవద్దని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఆత్మహత్యకు యత్నించి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డిని ఆయన పరామర్శించారు. తక్షణమే ప్రభుత్వం.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఇప్పటి వరకూ ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదని ఆక్షేపించారు.
ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ను పరామర్శించిన వీహెచ్